తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.
ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.