కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు.
‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విడుదల చేయాల్సింది’ అని తెలిపారు