ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిసిన సూర్యకుమార్ ఇక వన్డేల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వన్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. షమి, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండటంతో వాళ్ల పేర్లను పరిశీలించలేదు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, సంజు శాంసన్‌లు చోటు కోల్పోయారు. మిగిలిన టీమ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతున్న టీమ్‌కు అదనంగా కృనాల్ పాండ్యాకు కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
వన్డేలకు టీమిండియా: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్‌దీప్, కృనాల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్