తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు.
ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 శాతం ఉంది.
రికవరీ రేటు 98.64గా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీలో 47 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.