Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ హైలెట్స్

తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ హైలెట్స్

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపిస్తున్నారు. 

-రాష్ర్ట బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు

-రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

-ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

-పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

-వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్

-ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు

-ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు

-నేత‌న్న‌ల సంక్ష‌మం కోసం రూ. 338 కోట్లు

-బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు

-మొత్తంగా బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు

-మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు

-మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు

-మ‌హిళా, శిశు సంక్షేమం

-షీ టాయిలెట్ల‌కు రూ. 10 కోట్లు

-మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు

-మొత్తంగా మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు

-డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ. 11 వేల కోట్లు

-ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 500 కోట్లు

-ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు

-హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి కోసం 

-ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు

-సుంకిశాల వ‌ద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు

-మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 200 కోట్లు

-మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు

-ఓఆర్ఆర్ ప‌రిధి లోప‌ల కొత్త‌గా ఏర్ప‌డిన కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ. 250 కోట్లు

 

-వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ. 250 కోట్లు

-ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ. 150 కోట్లు

-మొత్తంగా ఈ బ‌డ్జెట్‌లో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు

-వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు

-విద్యారంగ అభివృద్ధికి నూత‌న ప‌థ‌కం కోసం రూ. 4 వేల కోట్లు

-పాఠ‌శాల విద్య‌కు రూ. 11,735 కోట్లు

-ఉన్న‌త విద్యారంగానికి రూ. 1,873 కోట్లు

-ప‌ల్లెప్ర‌గ‌తి కింద ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ‌పంచాయ‌తీల‌కు రూ. 5,761 కోట్ల నిధులు విడుద‌ల‌

-తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్ల నిధులు ఇస్తాం

-ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు ఇస్తాం

-పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు

-ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు

-వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్

-వ్య‌వ‌సాయ రంగానికి రూ. 25 వేల కోట్లు

‌- వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ. 1500 కోట్లు

-రైతుబంధు ప‌థ‌కానికి రూ. 14,800 కోట్లు

-రైతు రుణ‌మాఫీకి రూ. 5,225 కోట్లు

-రైతు బీమా ప‌థ‌కానికి రూ. 1200 కోట్ల‌కు పెంపు

-ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు

-సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు

-స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు

-ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు

-క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్  ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు

-గురుత‌ర బాధ్య‌త‌లు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు

-ఏడేళ్ల తెలంగాణ తెలంగాణ అనేక రాష్ర్టాల‌ను ప్ర‌గ‌తిలో అధిగ‌మించింది.

-ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం నెర‌వేరుస్తోంది.

-అభివృద్ధిలో తెలంగాణ అగ్ర‌భాగాన నిలిచింది.

-నిర్దేశిత ల‌క్ష్యాల‌ను నిర్దిష్ట స‌మ‌యంలో పూర్తి చేస్తున్నాం.

-స‌మ‌స్య‌లు, స‌వాళ్లు అధిగ‌మిస్తూ ప్ర‌గ‌తి ప‌థాన ప‌య‌నిస్తున్నాం.

-క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింది.

-రాష్ర్టంలో క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat