గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రుణాలను మాఫీ చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
ఇక ఈబడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ. 14,800 కోట్లు, రైతుబీమాకు రూ. 1200 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లకు ప్రతిపాదించినట్లు హరీష్ రావు ప్రకటించారు.