2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం 11:30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అలాగే శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గతేడాదికంటే మెరుగైన బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.