తెలంగాణ రాష్ర్టంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
సభ్యులు సూచించిన అనేక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది.
దేశం పరిస్థితి కంటే మన రాష్ర్టం పరిస్థితి మెరుగ్గా ఉంది. కొన్ని గురుకుల హాస్టళ్లల్లో, మంచిర్యాల పాఠశాలలో కొన్ని కరోనా కేసులు ఎక్కువ వచ్చాయి. కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. అన్ని శక్తులను ఉపయోగించి కరోనాను అదుపులో ఉందచేందుకు యత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.