త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వే జరపాలని ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయిచింది.
ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్‌బుక్‌లు అందించనున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంత మాత్రం అవకాశం ఉండదన్నారు.
ఈ సర్వే వల్ల వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా, దేవాలయ భూముల, వక్ఫ్ భూముల, అటవీ భూముల, ఇతర ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయన్నారు.