Home / HYDERBAAD / ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌: మంత్రి హరీశ్ రావు

ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌: మంత్రి హరీశ్ రావు

జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.

ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. స్వామివారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ బడ్జెట్‌ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నిరకాలుగా మేలు చేస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat