ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు మంగళవారం రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని విజయం సాధించారు.