తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన తన నియోజకవర్గ కేంద్రం ధర్మపురి కేంద్రానికి చెందిన దేవి శంకర్ చికిత్స కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రభుత్వం నుంచి 3లక్షల రూపాయలు మంజూరు చేయించారు.ఇందుకు సంబంధించిన LOC పత్రాన్ని శంకర్ భార్య దేవి అంజలి చేతికి మంత్రి అందించారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న శంకర్ శనివారం నిమ్స్ లో చేరారు. విషయం తెలుసుకున్న కొప్పుల వెంటనే స్పందించి కొంత నగదు సహాయం కూడా చేశారు.శాసనసభలో సోమవారం బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో మంత్రి మాట్లాడి కొన్ని గంటల వ్యవధిలోనే ఎల్ ఒ సి మంజూరు చేయించారు.
తానే స్వయంగా నిమ్స్ కు వెళ్లి LOC శంకర్ భార్య చేతికిచ్చి ధైర్యం చెప్పారు.శంకర్ ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. మరింత శ్రద్ధ చూపి మెరుగైన వైద్యసేవలందించాల్సిందిగా వైద్యులను మంత్రి కోరారు.