తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ప్రారంభించారు.
ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(సభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.