ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. సుందర్ 2, ఠాకూర్ 2, చాహల్ భువనేశ్వర్ చెరో వికెట్ పడగొట్టారు.