తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు.
దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు