బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి.
అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో కంగనా సంచలన కామెంట్స్ చేసింది