ఇంగ్లండ్తో జరిగిన తొలి T20లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై పెద్ద చర్చ జరిగింది ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్‌ను ఎందుకు తప్పించారని విమర్శలు వచ్చాయి.
రొటేషన్ పద్ధతిలో భాగంగానే అతడికి విశ్రాంతినిచ్చారని తెలిసింది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలనే ఈ విధానాన్ని అమలు చేస్తోందట. ఈ ఏడాది ICC T20 వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది.