డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ విచారణకు హాజరయ్యాడు.