స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
75 వారాలపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు.