పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఆమెకు ధీటైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.
ఇందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని భావిస్తూ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు దాదా కూడా “ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అని అన్నాడు తప్ప రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పలేదు.