తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరింది. ఇక నిన్న ఇద్దరు కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,646కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 176 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,780 యాక్టివ్ కేసులున్నాయి.
