ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు.
తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు