జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 260మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు.
వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జలవిహార్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు.