తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభ లేఖ రాశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ,ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ శరీరాలే వేరని, ఆత్మ ఒక్కటేనన్నారు. ఎన్నికలప్పుడు కుస్తీ తర్వాత దోస్తే చేస్తారని ఆరోపించారు.
అటు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరవధిక దీక్ష సిద్దమా? అని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుదామన్నారు. తన సవాల్ కు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.