అరటిపండు, ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని నిపుణులు చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది.
అయితే రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. ఆటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రిపూట యాపిల్ పండ్లను తినొద్దు