ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల నేతలంతా కృషి చేస్తాం’ అని అన్నారు