తెలంగాణ రాష్ట్రంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2010, ఆగస్టు 4న జారీ చేసిన జీవో 433ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది
