త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్’ మూవీలో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘సలార్ లో నేను యాక్షన్ సీన్స్ చేస్తున్నానని వచ్చే వార్తల్లో నిజం లేదు. నాకు ఫైట్ సీన్స్ ఉండవు. ఇంకా ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా నటిస్తారు. కానీ ప్రభాస్ నిజంగానే సింప్లిసిటీ కలిగిన వ్యక్తి’ అని అంది