Home / SLIDER / కేంద్రం ఏమిచేసిందో బీజేపీ స‌న్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ స‌న్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్

‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లా డారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్‌ ఉపఎ న్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విద్యార్థినేతలకు దిశా నిర్దేశంచేశారు. కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

రెండు దశాబ్దాల వెనుక

సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం.. ఆనాడు కేసీఆర్‌ వయస్సు 45 సంవత్సరాలు. నాడు చంద్రబాబు టీడీపీ, బీజేపీ, కాం గ్రెస్‌లు తెలంగాణకు మూడు ప్రతికూలశక్తులుగా ఉన్నాయి. కేసీఆర్‌ నాడు రాష్ట్రమంత్రిగా పనిచేసినా మెదక్‌ జిల్లా ప్రజలకు మాత్రమే తెలుసు. కులబలం, మనీపవర్‌, మజిల్‌ పవర్‌ లేదు, మీడియా  పవర్‌ లేదు. హైదరాబాద్‌లో పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, బాగా డబ్బున్న పెద్దపెద్ద సేట్లు ఉన్నా ఏ ఒ క్కడు కూడా తెలంగాణకు అనుకూలంగా లేడు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ ఒకే ఒక్కడు.. ప్రజల్లో ఉన్న అపనమ్మకా న్ని పోగొట్టేందుకు.. వారిలో తెలంగాణ ఆకాంక్షను బలంగా తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్‌ పదవిని, టీడీపీని గడ్డిపోచలాగా తీసిపడేసి.. టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రారం భించారు. ‘దబ్బున నేను గిట్ల ఎత్తిన తెలంగాణ గులాబీ జెండా దించితే. రాష్ట్రం రాకుండానే నేను పక్కకు తప్పుకుం టే.. నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. దేశ రాజకీయ ఉద్యమాల చరిత్రలో ఇంత బలంగా చెప్పిన గొప్ప నాయకుడు ఒక్క కేసీఆర్‌ మాత్రమే. తెలంగాణ శక్తులను ఏకం చేసి.. బరిగీసి బరాబర్‌ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన గొప్ప నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌.

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ సన్నాసులు చెప్పాలె

ఆరున్నరేండ్లలో తెలంగాణకు ఏం చేశారో బీజేపీ సన్నాసులు చెప్పాలి. దేశంలో కొత్తగా 5 ఐఐఎంలు, 2 ఐఐఎస్‌ఈర్‌, 16 ట్రిపుల్‌ ఐటీలు,  నాలుగు ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌),  84 నవోదయ పాఠశాలలు, 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదు. పైపెచ్చు హైదరాబాద్‌లో ఉన్న ఎన్‌ఐడీని నెల్లూరుకు ఎత్తుకుపోయారు? తెలంగాణకు ఎందుకివ్వరు? తెలంగాణ దేశంలో లేదా? ట్రైబల్‌ యూనివర్సిటీని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోరు. తెలంగాణకు ఏవీ ఇవ్వకుండా నిరుద్యోగులను, విద్యావంతులను ఏ మొహం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతది?  తెలంగాణలో ఓట్లు అడిగే హక్కుందా? అర్హత ఉందా? ఏమన్నా అంటే ఇండియా-పాకిస్తాన్‌.. దేశం కోసం ధర్మంకోసం.. అంటరు. చేసింది చెప్పమంటే ఒక్కముచ్చట చెప్పరు.

గోబెల్స్‌కు తాతలు

బీజేపీ నాయకులు గోబెల్స్‌కు తాతల్లాగా అసత్యాలను ప్రచారంచేస్తున్నారు. మనం  ఉస్మానియా.. కాకతీయ.. శాతవాహన.. మహాత్మాగాంధీ.. పాలమూరు… జేఎన్‌టీయూ.. వంటి యూనివర్సిటీల్లో చదివినం. వాళ్లు మాత్రం వాట్సాప్‌ యూనివర్సిటీల్లో చదువుకొని పొద్దునలేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క మేలైనా ఉన్నదా? ఉంటే చెప్పుమని నిలదీయండి. వాళ్లలాగా బూతులు తిట్టాల్సిన అవసరంలేదు. తెలంగాణ దేశంలో భాగం కాదా? మాకెందుకు ఇవ్వరని సంస్కారవంతంగా అడగండి.

తుపాకీ వాడేలా చెయ్యొద్దు

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లు.. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఆయన వయస్సును కూడా గౌరవించడం లేదు. టీఆర్‌ఎస్వీ విద్యార్థిలోకం.. యువలోకం గురించి తెల్వక మాట్లాడుతున్నరు. ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అన్న విషయం మరచిపోయి న్రు. కేసీఆర్‌ మాట్లాడాల్సివస్తే ఇంకెవ్వరూ మాట్లాడలేరు. కేసీఆర్‌ సైలెంట్‌గా ఉన్నరు. మాట్లాడతలేరు కాబట్టి ఎవడు పడితే వాడు.. ఎటు పడితే అటు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. నిన్న ఇయ్యాల పుట్టినోళ్లు ఎగిరెగిరిపడుతున్నరు. యా దికి పెట్టుకోండి.. గోడకు వేలాడేసిన తుపాకీ కూడా సైలంట్‌గానే ఉంటది. కానీ వాడుడు మొదలుపెడితే మీ కంటే ఎక్కువగా.. మీకంటే పదునుగా చీల్చిచెండాడేస్తాం. మీకు దిమ్మతిరిగే సమాధానం చెప్పే సత్తా మా విద్యార్థిలోకానికి ఉన్నది. కేసీఆర్‌ గురించి ఒకాయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్‌గా  పెట్టుకున్నడు. నీలాంటి బఫూన్‌గాండ్లను ఉరికిచ్చికొట్టు డు లెక్కకాదు. టైం వస్తది. ప్రతీది రాసిపెట్టుకుంటున్నం. మిత్తీతోసహా వసూలు చేస్తం. గిట్లనే మాట్లాడి ఒకాయన (ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని ప్రస్తావిస్తూ) ఖతమైపోయిండు.. జాగ్రత్తగా ఉండండి. మొరిగే కుక్కలతోని ఏం కాదు. మీది కేసీఆర్‌ స్థాయే కాదు.. మా తమ్ముళ్లే చూసుకుంటరు.

అంకెలతో వారి నోళ్లు మూయండి

తెలంగాణ సాధించుకున్నాక అనేక రంగాల్లో మనం సాధించిన ప్రగతిని అంకెలతో సహా చెప్పి వాళ్ల నోళ్లకు సంకెళ్లు వేయా లి. విద్యారంగంలో ఆరున్నరేండ్లలో మనం అసాధారణ ప్రగ తి సాధించాం. ఉమ్మడి రాష్ట్రంలో 298 గురుకులాలే ఉండేవి. కొత్తగా 672 స్థాపించుకున్నాం. 4.32 లక్షల మంది విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తున్నాం. ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. రాష్ట్రం రాకముందు 134 ఉంటే కొత్తగా 104 ఏర్పాటు చేశాం. గతంలో దళిత విద్యార్థులకు ఒక్క డిగ్రీ కాలే జీ లేని దుస్థితిని గమనించిన సీఎం కేసీఆర్‌ కొత్తగా ఎస్సీల కోసం 30 ఏర్పాటుచేశారు. గిరిజనుల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లు రాష్ట్రం రాకముందు 96 ఉంటే కొత్తగా 62 ఏర్పాటు చేసుకున్నాం. ఎస్టీ విద్యార్థుల కోసం 22 డిగ్రీ కాలేజీలు. మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 12 ఉంటే టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కొత్తగా 192 నెలకొల్పింది. బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 19 ఉంటే కొత్తగా 261 ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 11 పాలిటెక్నిక్‌ కాలేజీలు పెట్టాం. 240 గురుకుల పాఠశాలలకు రూ.370 కోట్లతో కొత్త భవనాలు నిర్మించుకుంటున్నాం. ప్రతి ఏడాది 15 లక్షల మంది విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ అందజేస్తున్నాం. ఆరేండ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.12,800 కోట్లు ఖర్చుపెట్టినం. 18లక్షల మంది విద్యార్థులకు మెస్‌చార్జీలు చెల్లించినం. 3,850 మంది విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌ కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటుచేసుకున్నాం.

గెలుపులో భాగస్వాములు కావాలి

బరాబర్‌ మనమే రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తున్నాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి సురభి వాణీదేవి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం మరోసారి విద్యార్థి యువకిషోరాలు ఉద్యమస్ఫూర్తిని చాటాలి. వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్‌ ముగించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే వాసుదేవరెడ్డి. మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు పిడమర్తి రవి, చిరుమల్ల రాకేశ్‌, విద్యాసాగర్‌, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఉద్యోగాలు భర్తీ చేయలేదని అసత్యాలు ప్రచారంచేస్తున్నారు. వాటిని తిప్పికొట్టాలి. జోనల్‌ వ్యవస్థ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. అది పరిష్కారంచేయరు.. కానీ ఇక్కడ మాట్లాడుతరు. తెలంగాణ ఏర్పాటైన తరువాత టీఎస్పీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డ్‌ ద్వారా సింగరేణి.. మొదలైన శాఖల్లో 1,32,899 ఉద్యోగాల భర్తీచేసుకున్నాం. ఎన్నికలకోడ్‌ అయిపోగానే 50 వేల ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ వస్తుంది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat