తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 ఏండ్ల వయసు సైబడిన 11,854 మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
5530 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు, సమయం తేదీని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అనేక మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు