విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది.
ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా వాడుతారు.