కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనిలో స్థానిక నాయకుడు శ్రీకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణిదేవి గారికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.
విద్యావంతురాలైన సురభి వాణిదేవి గారిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో ఆలోచనతో సురభి వాణి దేవి గారికి ఓటు వేసి వారి అఖండ విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిట్ల దివాకర్, కో-ఆప్షన్ సభ్యుడు అభిషేక్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, నాయకురాలు నవ్య, కాలని వాసులు ప్రొఫెసర్ త్రినేత్ రావు, నాగరాజ్, సాయి రాజ్ తదితరులు పాల్గొన్నారు.