ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు.
ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని విమర్శించారు.
విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ పాల్గొన్నారు. విశాఖ పరిస్థితి చూస్తే బాధగా ఉందని, రెండేళ్లలో రోడ్లపై ఒక్క గుంతైనా పూడ్చారా? అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.21 వేలకు పెంచుతామని, 100 రోజుల్లో అన్న క్యాంటీన్లను తెరుస్తామని హామీ ఇచ్చారు