ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవి, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సనత్‌నగర్‌లోని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురుగా కాకుండా, విద్యావేత్తగా వాణీదేవిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని కోరారు.
సీనియర్ సిటిజన్స్ సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి అన్నారు. నన్ను గెలిపిస్తే మీ గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. విద్యారంగంలో 35 ఏండ్ల అనుభంవం ఉందని చెప్పారు. అభివృద్ధిని కొనసాగించేందుకు టీఆర్‌ఎస్‌ను బలపర్చాలని ఆమె కోరారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచ్చారని అన్నారు.