భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్లో పాల్గొన్నారు.
భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ వేయించుకున్న 88 ఏళ్ల మన్మోహన్.. అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీలోని ఫోర్టిస్ అనే ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు