Home / BHAKTHI / యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్‌ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు.

గతంలో తన ఆదేశాలతో ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా అసంతృప్తిగా ఉన్న వాటిపై ఆరా తీశారు. కొండ దిగువన పచ్చదనం పెంపు, కాలికనడక నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో సుందరీకరణ, విద్యుద్దీపాల ఏర్పాటు చేసేందుకు స్తంభాలకు సంబంధించిన వివరాలు ఆనంద్‌ సాయి సీఎంకు వివరించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిగారు. మాఢ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.

గతేడాది సెప్టెంబర్‌ 13న యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్‌, ఐదు నెలల అనంతరం మళ్లీ క్షేత్రంలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయం పునః ప్రారంభం ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించేందుకు యాద్రాద్రిలో పర్యటిస్తున్నారు. రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు 2016, అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.850 కోట్లు వెచ్చించినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat