తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ0 నుండి పోటీ చేస్తున్న మాజీ ప్రదాని పి.వి. నర్సింహరావు కుమార్తె సురభి వాణీ దేవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథ0 అన్నారు.శాంతి నగర్ లోని వడ్డేపల్లి మాజీ జడ్పిటిసీ శ్రీనివాసులు స్వగృహంలో టి ఆర్ ఎస్ నాయకులు మందా శ్రీనాథ్, వడ్డేపల్లి కౌన్సిలర్ అజయ్ కుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పోరు లో సురభి వాణీ దేవి గెలుపొందడం ఖాయమని, కేసీఆర్ అభివృద్ధి పథకాలే టి ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపిస్తాయని గుర్తు చేశారు. ఎక్కడ లేని విధంగా సభ్యత్వ నమోదు లు రికార్డు స్థాయి లో జరుగుతున్నాయని తెలిపారు.
వడ్డేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామాల్లో టి.ఆర్.ఎస్. సభ్యత్వాల నమోదు లో పోటీపడి చెప్పిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో సురభి వాణీ దేవి గెలుపు కు యువత , పట్టభధ్రులు , ఉద్యోగ , ఉపాద్యాయులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.