ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది.
5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో.. 4 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా.. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇదో సందేశమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. కళ్యాణ్పురి, రోహిని, త్రిలోక్‌పురి, షాలిమార్ భాగ్ వార్డుల్లో విజయం సాధించింది. చౌహాన్ భంగర్ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.