కరోనా తర్వాత విడుదలైన క్రాక్ మూవీలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ చిత్రంలో అమ్మడు నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.
అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు అనుకుని మహానటి.. తెలుగు సినిమా ప్రేక్షకుల కలల రాకూమారి అయిన నటి కీర్తి సురేశ్ తప్పులో కాలేసింది. నటి వరలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో పొరపాటు చేసింది.
ట్విటర్ లో ‘హ్యాపి బర్త్డే వరూ, ఈ పుట్టినరోజు నీకు చాలా సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా నీకు మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. దీనికి స్పందించిన వరలక్ష్మి ధన్యవాదాలు చెల్లీ. అయితే నా పుట్టినరోజు ఐదో తేదీన ‘ అని పేర్కొంది