ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు.
అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.