కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.