బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు.
నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ చేసింది.