ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు.
అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు..