ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట.
దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా దూరమయ్యాడు..