సాధారణంగా కరోనా వైరస్ నిరోధానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులుగా తీసుకునేవే. అయితే తొలిసారి కేవలం ఒక డోసుతోనే సమర్థంగా పనిచేసే టీకాను జాన్సన్ అండ్ జాన్సన్ అనే అమెరికా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికాలో టీకా అత్యవసర వినియోగానికి FDA విభాగం ఆమోదముద్ర వేసింది. మూడు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామని, టీకా 85% రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.