తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ,హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి పద్నాలుగు తారీఖున జరగనున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంచార్జులను నియమించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జ్ గా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి తన్నీరు హారీష్ రావు,హైదరాబాద్ జిల్లాకు గంగుల కమలాకర్ ను నియమించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుండి ఎన్ రామచంద్రారావు,అధికార టీఆర్ఎస్ తరపున దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తనయ సురభి వాణీదేవి,స్వతంత్ర అభ్యర్థిగా ప్రొ. నాగేశ్వర్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి పదిహేడు తారీఖున వెలువడనున్నాయి.