Home / SLIDER / కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా

జీతం జానెడు.. చాకిరీ బారెడు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరుచూ వినిపించిన మాట. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక.. వాటిని విడువలేక ఆయా కుటుంబాలు పడిన బాధలెన్నో. స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం, అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం.చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం ఎప్పుడూ పైస్థాయి ఉద్యోగుల సంక్షేమాన్నే చూస్తుందనే అపవాదును చెరిపేసింది.

ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతోపాటు, ఉన్నతాధికారుల ఆదేశాలను కిందిస్థాయిలో అమలుచేస్తున్న ప్రతి ఉద్యోగి అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్‌.. వారి వేతనాలను భారీగా పెంచారు. ఆరేండ్లలో 3,20,243 మంది ఉద్యోగుల వేతనాలను రెండు నుంచి నాలుగురెట్లు పెంచారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం సకల జనులతో కలిసి వచ్చి తమ ఉద్యోగాలను సైతం ఫణంగా పెట్టి ఉద్యమంలో ముందువరుసలో నిలిచిన చిరు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ జాబితాలో ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, హోంగార్డులు, విద్యావలంటీర్లు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు ఇతర ఉద్యోగులున్నారు. తాత్కాలిక ఉద్యోగులు కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే జీవనం గడిపేలా ఉద్యోగ స్థాయిని బట్టి కనీసం 50% నుంచి నాలుగైదు రెట్లు పెంచారు.

కుటుంబ పెద్దగా కేసీఆర్‌..

ఉద్యోగులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లిన కేసీఆర్‌.. స్వరాష్ట్రంలో సీఎం హో దాలో ప్రగతిభవన్‌లో విభాగాలవారీగా వారితో సమావేశమయ్యారు. ఇంటిపెద్దన్నగా వారి సాధకబాదకాలను తెలుసుకొని జీతాలను రెట్టింపుచేశారు. అంగన్‌వాడీలతో సభపంక్తి భోజనంచేసి, వారి జీతాలు పెంచుతున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆశావర్కర్ల జీతం ఐదురెట్లు పెంచారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వారు అడుగకముందే రెట్టింపు చేసి ‘సలాం సఫాయన్న’ అని అన్నారు.

గ్రామ పంచాయతీల్లో వెయ్యి, రూ.1,500 పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కచ్చితంగా రూ.8,500 ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అతి తక్కువ జీతాలకు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, పార్ట్‌టైం లెక్చరర్లు, రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల జీతాలను భారీగా పెంచారు. అనేక ఏండ్లుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలనుకూడా రెట్టింపుచేశా రు. హోంగార్డులకు జీతాన్ని భారీగా పెంచడంతోపాటు, ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేకంగా కాలుష్య అలవెన్సులను ప్రకటించారు. ఆలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు ప్రత్యేకంగా వేతనం అందిస్తున్నారు. చిరుద్యోగులు జీతాలు పెంచడమే కాదు.. నెలనెలా ఠంచన్‌గా అందేలా ఆర్థికశాఖకు ఆదేశాలు కూడా జారీచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat