తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జంట లాయర్ల హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు గురువారం గవర్నర్ తమిళ సైతో భేటీ అయిన పార్టీ కార్యవర్గం… తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రభుత్వ, పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ నోరు తెరవరెందుకని ప్రశ్నించారు.సీబీఐకి కేసు అప్పగించి నిజనిజాలు లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.