కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని కళావతి నగర్ లో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ రశీదులు కార్యకర్తలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయమని, అందుకే ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో సంక్షేమ పథకాల ద్వారా ఆసరా కల్పిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుని గుర్తిస్తున్న ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు తీసుకుంటున్నారని తెలిపారు.
తక్కువ సమయం ఉండడంతో నిర్దేశించిన లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడై సుభాష్ నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త మురళి కృష్ణ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, వార్డు సభ్యులు సిద్దిక్, నేతిరాజ, సరస్వతి, నాయకులు శ్రీకాంత్, రాజేష్, యాదగిరి, లక్ష్మణ్, ఫయాజ్, మహేందర్, మురళి కృష్ణ, సహదేవ్, మహిళా కార్యకర్తలు ఎల్లమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు.