నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని 294 శాసనసభ స్థానాలకు, తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, అసోంలోని 126 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటిస్తున్నారు.
కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన సీఈసీ నాలుగు రాష్ర్టాలు, ఒక యూటీలో మొత్తం 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు